Nara Lokesh : మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ ...లోకేశ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎక్స్‌లో కామ్రేడ్లకు(comrades) సారీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎక్స్‌లో కామ్రేడ్లకు(comrades) సారీ చెప్పారు. ఇక ముందు ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్(Tweet) ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) మడకశిర(Madakashira) నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు సీపీఎం నేతలను(CPM Leaders) పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లను ఖండిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(srinivas rao) ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దానికి రియాక్టయిన లోకేశ్ కమ్యూనిస్టులకు సారీ చెప్పారు. లోకేశ్ ఏం రాసుకొచ్చారంటే.. 'సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను' అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అలాగే ఈ ట్వీట్‌ను ఏపీ పోలీస్ 100కు ట్యాగ్ చేశారు.