Nara Lokesh Tweet : వివేకాకు నివాళులర్పించిన సునీత దంపతులు.. బాబాయ్‌ను మరిచారన్న లోకేష్
నేడు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) 72వ జయంతి. ఈ సందర్భంగా పులివెందులలో(Pullivendhula) వివేకా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకా కూతురు సునీత(sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా సమాధి వద్ద నివాళులు అర్పించిన సునీత దంపతులు.. ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు.

అనంతరం సునీత మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసులో విచారణ జరుగుతుందని తెలిపారు. సీబీఐ(CBI) అధికారులు వారి పని వారు చేస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. కేసు విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి తాను మాట్లాడలేనని అన్నారు. తన తండ్రి బతికి ఉంటే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేవారమని చెప్పారు.
వివేకా జయంతిపై నారా లోకేష్(Nara Lokesh) ట్వీట్ చేశారు. వేటు వేసిన చేతితోనే బాబాయ్ జయంతికి ట్వీట్ వేస్తే బాగోదనేమోనని వేయలేదని ఎద్దేవా చేశారు. ట్వీట్‌లో.. ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయపోరాటంలో తప్పక గెలుస్తారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్‌తో జైలు ఊచలు లెక్కపెట్టించే వరకూ విశ్రమించరు. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని రాసుకొచ్చారు.
ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల… pic.twitter.com/P8SUSalpoJ
— Lokesh Nara (@naralokesh) August 8, 2023