సీఎం జగన్ గురించి లోకేశ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత?

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ యువనేత నారా లోకేశ్ పై విరుచుకుపడ్డారు. నారా లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని, మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని అన్నారు. నారా లోకేష్ ఎప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. వైసీపీలో మిగిలి పోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందని, ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ గురించి లోకేశ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత? అని ప్రశ్నించారు. కుప్పంలో మీ నాన్న, పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని అన్నారు. కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నువ్వు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలల పాటు జగన్ ను ఇబ్బంది పెట్టారని విమర్శించారు.

విజయవాడ మధుర నగర్ 29వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీ పతి, తదితరులు పాల్గొన్నారు.

Updated On 14 Feb 2024 2:08 AM GMT
Yagnik

Yagnik

Next Story