రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావు.. నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) రాజకీయాలైతే ఛస్తే అర్థం కావు. ఎప్పుడు ఏ పార్టీ సైడ్‌ తీసుకుంటారో, ఎప్పుడు ఏ పార్టీకి కటిఫ్‌ చెబుతారో రాజకీయంగా చంద్రబాబును పెంచి పెద్ద చేసిన ఓ వర్గం మీడియాకు కూడా తెలియదు. చంద్రబాబు ఏదైనా మాట్లాడగలరు. ఏదైనా చేయగలరు. అమరావతిలో ఒలింపిక్స్‌ను కండక్ట్ చేయగలరు.

రాజకీయాలు ఓ పట్టాన అర్థం కావు.. నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) రాజకీయాలైతే ఛస్తే అర్థం కావు. ఎప్పుడు ఏ పార్టీ సైడ్‌ తీసుకుంటారో, ఎప్పుడు ఏ పార్టీకి కటిఫ్‌ చెబుతారో రాజకీయంగా చంద్రబాబును పెంచి పెద్ద చేసిన ఓ వర్గం మీడియాకు కూడా తెలియదు. చంద్రబాబు ఏదైనా మాట్లాడగలరు. ఏదైనా చేయగలరు. అమరావతిలో ఒలింపిక్స్‌ను కండక్ట్ చేయగలరు. గెలిచినవారికి నోబెల్‌ బహుమతి ఇవ్వగలరు. మాటల సంగతి వదిలేస్తే చేతలు కూడా అలాగే ఉంటాయి. అసలు ఆయన అంటకాగిన రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ(TDP) పుట్టిందో అదే కాంగ్రెస్‌ పార్టీ(Congress)తో చేతులు కలిపారంటేనే చంద్రబాబు రాజకీయం అర్థమయ్యింది. కాంగ్రెస్ వ్య‌తిరేక‌తే పునాదిగా ఏర్ప‌డి, ద‌శాబ్దాల పాటు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా నిలిచిన టీడీపీ అసలు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుందని ఎవరైనా అనుకున్నారా? ఎన్టీఆర్‌(Senior NTR) చనిపోయి బతికిపోయారు. లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని తెలియగానే పాపం పెద్దాయనకు గుండె ఆగిపోయేది! కాంగ్రెస్‌తో కలిసిన వెంటనే చంద్రబాబు నోటి వెంట తనది కూడా కాంగ్రెస్‌ రక్తమే అన్న మాట వచ్చింది. పోనీ కాంగ్రెస్‌తో ఏడాదిపాటైనా ఉన్నారా? అదీ లేదు. 2019లో మళ్లీ మోదీ(Modi) ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. అప్పట్నుంచి బీజేపీ(BJP)కి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. మోదీ కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఎంతోమందితో చెప్పించారు. మోదీషా ద్వయం ఎందుకో చంద్రబాబును దూరం పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(AP CM Jagan) సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చంద్రబాబుతో పాటు, ఆయనకు వంతపాటే ఓ వర్గం మీడియా కూడా ఆక్రోశించింది. గగ్గోలు పెట్టింది. ఇలా అయితే త్వరలోనే ఏపీ శ్రీలంకలా మారడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టింది. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నాడంటూ జగన్‌ను ఆడిపోసుకుంటోంది. జగన్‌ ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ కార్యక్రమాల ఊసు ఆయా మీడియాలలో అసలు కనిపించదు.

ఇప్పుడు చంద్రబాబు ఏం చెబుతున్నారంటే తమకు అధికారాన్ని అప్పగిస్తే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తామంటున్నారు. ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామంటున్నారు. అన‌విగాని హామీల‌న్నింటినీ అమ‌లు ప‌రుస్తామని చెబుతున్నారు. ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తామని, అంతకంటే గొప్పగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా చాలా చాలా ఉచితాలు ప్రకటించారు. చంద్రబాబు ఇవన్నీ అమలు చేస్తే మాత్రం ఏపీ శ్రీలంకగా మారదు.. పైపెచ్చు సింగపూర్‌లా తయారుతుందట! మరో షాకింగ్‌ న్యూస్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రదర్‌ అనిల్ కుమార్‌(Brother Anil Kumar)తో చంద్రబాబు దగ్గరయ్యారన్నది ఆ వార్త సారాంశం. ఇప్పటికే బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో నారా లోకేశ్ సమావేశాలు ఒకట్రెండు జరిగాయట! చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో అనిల్‌కుమార్‌-లోకేశ్‌ల భేటి జరిగిందని వినికిడి. ఈ క్రమంలోనే లోకేశ్‌(Nara Lokesh)కు షర్మిల్‌(YS Sharmila) క్రిస్‌మస్‌ కానుకలను పంపించారట! చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలపగలరనడానికి ఇంతకు మించిన ఉదాహరణ అనవసరం! చిత్రమేమింటే ఇదే బ్రదర్‌ అనిల్‌కుమార్‌పై మొన్నటి వరకు చంద్రబాబు, ఆయనకు వంతపాడే మీడియా ఇష్టం వచ్చినట్టుగా ఆడిపోసుకున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు మతమార్పిడిలు చేయిస్తున్నారంటూ కథనాలు రాసింది ఓ వర్గం మీడియా. ప్రస్తుతం షర్మిల్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల సమయానికి షర్మిలతో టీడీపీ కలిసినా ఆశ్చర్యపడనవసరం లేదు.

Updated On 2 Jan 2024 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story