ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఉన్నప్పటికీ క్యాబినెట్‌లో నంబర్‌ టూ నారా లోకేశే

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఉన్నప్పటికీ క్యాబినెట్‌లో నంబర్‌ టూ నారా లోకేశే(Nara Lokesh) అన్నది జగమెరిగిన సత్యం! ప్రభుత్వంలో ఆయనదే పెత్తనం. రేపో మాపో ఆయనను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్‌ చేయబోతున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్‌దే హవా! ఆయన ఎంత చెబితే అంత! అలాంటి లోకేశ్‌ను మరొకరు ఆడిస్తున్నారట! ఆయన చెప్పినట్టుగానే లోకేశ్‌ వింటున్నారట! లోకేశ్‌ కోటరీలో పెద్ద తలకాయగా ఉంటున్న ఆయనపై తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి(Andhra jyoti) ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఆయన వ్యవహారశైలిపై సీనియర్‌ నాయకులు కూడా గుర్రుగా ఉన్నారంటూ రాసుకొచ్చిందా పత్రిక! లోకేశ్‌తో పని కావాలంటే ముందు ఆయనను కలిస్తే చాలని ఆంధ్రజ్యోతి అంటోంది. ఆంధ్రజ్యోతి ఆయన పేరును ప్రస్తావించలేదు కానీ అది సానా సతీశేనని అందరికీ తెలుసు. ఆయనేం అధికారి కాదు, అలాగని ప్రజా ప్రతినిధి కూడా కాదు. ఎవరాయన? ఏమిటాయన కథ? అంటే తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సానా సతీశ్‌ పాతికేళ్ల కిందట ఓ చిన్న ఉద్యోగి. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో ఎదుగు బొదుగు ఉండదని అనుకున్న సతీశ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఒకప్పుడు తెలుగుదేశంపార్టీలో ఉంటూ చంద్రబాబుకు సన్నిహితంగా మెలుగుతూ (చంద్రబాబుకు బినామీ అని అంటుంటారు) ఉండే ఎంపీకి సన్నిహితుడయ్యారు. ప్రస్తుతం ఆ ఎంపీ బీజేపీలో ఉన్నారనుకోండి.. అలా ఆ ఎంపికి దగ్గరైన సానా సతీశ్‌ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. మాజీ క్రికెటర్‌ చాముండేశ్వరీనాథ్‌తో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేష‌న్ మ్యూజియం క‌మిటీ స‌భ్యుడయ్యారు. ప‌దుల సంఖ్య‌లో కంపెనీల‌కు డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగారు. ఒక కేసు విష‌యంలో సీబీఐ ఉన్న‌తాధికారి రాకేశ్ అస్తానా మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా 5 కోట్ల రూపాయల లంచం అడిగిన‌ట్టు సానా స‌తీష్ 2018లో చేసిన ఆరోప‌ణ జాతీయ స్థాయిలో ఓ కుదుపు కుదిపాయి. ఇదే కాదు, సానా సతీశ్‌పై ఇంకా బోల్డన్నీ కేసులున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు దగ్గరయ్యారు. ఇప్పుడు లోకేశ్‌కు సతీశ్‌ ఎంత చెబితే అంతనట! ఈ విషయమే ఆంధ్రజ్యోతి రాసింది. కూటమి ప్రభుత్వంలో నేనే సూపర్‌ పవర్‌ అని ఆయన చెప్పుకుంటున్నారట! ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో మైనింగ్‌ వ్యవహారాలను తన చేతలోకి తీసుకున్నారు. మైనింగ్‌, అటవీ, రెవెన్యూ అధికారుల (డిప్యూటీ కలెక్టర్‌) బదిలీలు సతీశ్‌ చెప్పినట్టుగా సాగాయి. కీలకమైన పదవులలో తనకు విశ్వాసపాత్రులుగా వున్నవారిని నియమింపచేసుకున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. నిజంగానే అలా జరుగుతోంది. మైనింగ్‌ శాఖను గుప్పిటపెట్టుకునేంతగా సానా సతీశ్‌ ఎదిగారా? ఆంధ్రజ్యోతి రాతల వల్ల నారా లోకేశ్‌ పట్ల ప్రజలల్లో చిన్నచూపు రాదా? ఎందుకలా లోకేశ్‌పై రాధాకృష్ణ కత్తి కట్టారు? తన మాటను కాదంటున్నందుకా? ఏమో మరి.

Eha Tv

Eha Tv

Next Story