తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)కు ఇవాళ బ్రేక్‌ పడింది. అందుకు కారణం లోకేశ్‌ రెండు కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి కోర్టు(Mangalagiri Court)కు హాజరుకావాల్సి ఉండటం! తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై లోకేశ్‌ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)కు ఇవాళ బ్రేక్‌ పడింది. అందుకు కారణం లోకేశ్‌ రెండు కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి కోర్టు(Mangalagiri Court)కు హాజరుకావాల్సి ఉండటం! తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై లోకేశ్‌ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిపై పరువు నష్టం దావా వేసిన లోకేశ్‌ లేటెస్ట్‌గా ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళిపైనా, సింగలూరు శాంతి ప్రసాద్‌ అనే వ్యక్తిపైనా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇటీవల ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్‌పై పోసాని కృష్ణమురళి ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేశ్‌ 14 ఎకరాల భూములు కొన్నారని చెప్పారు. అయితే దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ తనకు కంతేరులో అర ఎకరం భూమి కూడా లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని తన లాయర్‌ ద్వారా నోటీసులు పంపించారు లోకేశ్‌. రెండు సార్లు నోటీసులు పంపించినా పోసాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోసానిపై పరువునష్టం దావా వేశారు లోకేశ్. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరై లోకేష్ తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. తనపై బురదజల్లితే గమ్మున ఊరుకునేవాడిని కాదని లోకేశ్‌ హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసిన వారిని న్యాయస్థానానికి లాగుతానని, వారిపై కేసులు పెడతానని చెప్పారు. కోర్టుకు హాజరవుతున్నందున ఆగస్టు 18న పాదయాత్రకు లోకేశ్‌ విరామం ప్రకటించారు. మరోవైపు ఇంకో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించిన ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న సింగలూరు శాంతి ప్రసాద్‌ అనే వ్యక్తి లోకేశ్‌పై పలు ఆరోపణలు చేశారు. అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఏజెన్సీ నుంచి లోకేశ్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈవిషయం తన స్నేహితుడి ద్వారా తెలిసిందని అన్నారు. దీనిపై కూడా లోకేశ్‌ రియాక్టయ్యారు. శాంతి ప్రసాద్‌కు కూడా నోటీసులు పంపించారు. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంతో లోకేశ్‌ కోర్టును ఆశ్రయించారు.

Updated On 18 Aug 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story