ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. అయితే టీడీపీ(TDP) అధినేత చంద్ర‌బాబు(Chandrababu) జైలులో ఉన్న నేప‌థ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై టీడీపీ చర్చించింది. ఈ మేర‌కు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ(TDLP) నిర్ణయించింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. అయితే టీడీపీ(TDP) అధినేత చంద్ర‌బాబు(Chandrababu) జైలులో ఉన్న నేప‌థ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై టీడీపీ చర్చించింది. ఈ మేర‌కు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ(TDLP) నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన తమ వాణిని వినిపించాలని నిర్ణయించినట్లు టీడీపీ ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పలువురు టీడీపీ నేత‌ల‌తో చర్చించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదనంతరం జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీఎల్పీలో పార్టీ నేతలు నిర్ణయించారు.

నారా లోకేశ్ అధ్యక్షతన జూమ్ ద్వారా టీడీఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొనగా.. నారా లోకేశ్ ఢిల్లీ నుంచి జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నారా లోకేశ్ సూచించారు. పోరాటమే అజెండాగా టీడీపీ పనిచేయాలని.. ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ సభ్యులకు సూచించారు. చట్టసభలలో చేయాల్సిన పోరాటం చట్టసభలలో చేద్దాం.. వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామని నేత‌ల‌తో అన్నారు.

Updated On 20 Sep 2023 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story