Nara Lokesh : ఓడినచోటే గెలవాలనే మంగళగిరి నుంచి పోటీ
తనను మంగళగిరితోపాటు మరో నియోజకవర్గంలో పోటీచేయాలని కొందరు సన్నిహితులు సూచించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో మంగళగిరిలోనే పోటీచేస్తున్నానని చెప్పారు.
తనను మంగళగిరితోపాటు మరో నియోజకవర్గంలో పోటీచేయాలని కొందరు సన్నిహితులు సూచించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో మంగళగిరిలోనే పోటీచేస్తున్నానని చెప్పారు. ఉండవల్లి నివాసంలో పలువురు పార్టీలోకి చేరిన సందర్భంగా పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశచరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుడైన జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేశాం. దళితవాడలు అభివృద్ధి చెందాయంటే టీడీపీనే కారణం. జగన్ పాలనలో దళితులకు సంబంధించిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేదే టీడీపీ లక్ష్యం. పార్టీలో కొత్తగా చేరినవారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషిచేయాలని లోకేష్ కోరారు.