నారా లోకేశ్‌(Nara Lokesh) పాదయాత్ర యువగళం(Yuvagalam Padayatra) మళ్లీ మొదలయ్యింది. అనుకున్నట్టుగానే తన ప్రసంగంలో చంద్రబాబును(Chandrababu) అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ చెప్పుకొచ్చారు.తనపై కూడా కేసు పెట్టి సీఐడీ(CID) విచారణకు పిలిచారని అన్నారు. తాను ఎవరికీ భయపడనని అన్నారు. మంత్రులకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని హెచ్చరించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ప్రసంగంలో జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌పై(Pawan Kalyan) లోకేశ్‌ పొగడ్తల వర్షం కురిపించడమే విచిత్రంగా అనిపించింది.

నారా లోకేశ్‌(Nara Lokesh) పాదయాత్ర యువగళం(Yuvagalam Padayatra) మళ్లీ మొదలయ్యింది. అనుకున్నట్టుగానే తన ప్రసంగంలో చంద్రబాబును(Chandrababu) అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ చెప్పుకొచ్చారు.తనపై కూడా కేసు పెట్టి సీఐడీ(CID) విచారణకు పిలిచారని అన్నారు. తాను ఎవరికీ భయపడనని అన్నారు. మంత్రులకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని హెచ్చరించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ప్రసంగంలో జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌పై(Pawan Kalyan) లోకేశ్‌ పొగడ్తల వర్షం కురిపించడమే విచిత్రంగా అనిపించింది. పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన జిందాబాద్‌ వంటి నినాదాలు లోకేశ్‌ నోటి వెంట రావడం ఆసక్తికర పరిణామం! ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ(TDP) నేతలు మరొకరిపై ప్రశంసలు కురిపించడం జరగలేదు. చంద్రబాబు తనకు తాను గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరొకరిని మెచ్చుకున్నది లేదు. అడపాదడపా తన మామగారు ఎన్టీఆర్‌ పేరు తలుస్తారు. అంతే తప్ప తన సమకాలీన నాయకులను ఆయన మెచ్చుకోవడం తెలుగు ప్రజలు ఇప్పటి వరకు చూడలేదు. ఆయన కుమారుడు లోకేశ్‌ కూడా అంతే! తన తండ్రిని పొగడడమే తప్ప ఇతరుల గురించి ఒక్క మంచి మాట్లాడింది లేదు. ఇప్పుడు హఠాత్తుగా జనసేన అధినాయకుడు పవన్‌ కల్యాణ్‌ పేరును పదే పదే తలుస్తున్నారు. తన పార్టీకి సెకండ్‌ ప్రియారిటీని ఇచ్చి మొదటి ప్రాధాన్యతను జనసేనకు ఇస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ లోకేశ్‌ అనడం టీడీపీ కార్యకర్తలకు కూడా మింగుడుపడటం లేదు. మొత్తంగా పవన్‌పై లోకేశ్‌ అవాజ్యమైన ప్రేమను కురిపిస్తున్నారని అర్థమవుతోంది.

Updated On 27 Nov 2023 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story