TDP Troll On Tv9 : టీవీ 9ను టార్గెట్ చేసిన టీడీపీ ! ఎందుకో తెలుసా?
వార్త పత్రికలు(News), న్యూస్ ఛానళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది! మరీ ముఖ్యంగా తెలుగు మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు బాకాలుగా మారాయి. అందుకే రాజకీయ నాయకులకు టార్గెట్‌లుగా మారుతున్నాయి.
వార్త పత్రికలు(News), న్యూస్ ఛానళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది! మరీ ముఖ్యంగా తెలుగు మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు బాకాలుగా మారాయి. అందుకే రాజకీయ నాయకులకు టార్గెట్‌లుగా మారుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతిలపై(Andhra jyoti) తరచూ విమర్శలు చేసేవారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఆ రెండు పత్రికలు, వాటి అనుబంధ న్యూస్ ఛానెళ్లతో పాటు టీవీ 5 ని(TV5) కూడా తిట్టిపోస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ(TDP) ఇప్పుడు ఆ బాటలోనే పయనిస్తోంది. కాకపోతే సాక్షి జోలికి అంతగా పోకుండా ఇప్పుడు టీవీ 9ను(TV9) లక్ష్యంగా చేసుకుంటోంది. వీలుదొరికినప్పుడల్లా టీవీ 9ను తిట్టిపోస్తున్నారు టీడీపీ నేతలు! ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) చాలాసార్లు టీవీ 9 న్యూస్ ఛానెల్‌ను ప్రత్యక్షంగానే విమర్శించారు. రియలెస్టేట్ వ్యాపారులు మీడియాలోకి ఎంటరైతే ఇలాగే ఉంటుందని సెటైర్లు కూడా విసిరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara lokesh) కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. మొన్నామధ్య రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో అయితే టీవీ 9ను ఘాటుగా తులనాడారు.
గత కొంతకాలంగా టీవీ9పై తెలుగుదేశం పార్టీ తీవ్ర అసహనంతో ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఆ ఛానెల్ అమ్ముడుపోయిందని సామాజిక మాధ్యమాలలో రాస్తున్నారు. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయమని పిలుపు ఇచ్చేంత వరకు వెళుతున్నారు. తాజాగా మహాసేన రాజేశ్‌కు టీవీ9కు మధ్య గట్టి పోరాటమే సాగుతోంది. రాజేశ్‌పైనా, సంస్థ మాజీ ఉద్యోగులపైనా టీవీ 9 పెట్టిన కేసు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాజేశ్‌పై టీవీ9 సంస్థ అక్రమకేసులు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తున్నది. ఆయనపై పగబట్టినట్టు వ్యవహరిస్తోందని, మరే దళితుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేందుకు టీవీ 9 కుట్ర పన్నుతోందని టీడీపీ అంటోంది.
ఇప్పుడు టీవీ 9 సంస్థపైనే కాకుండా టీవీ9 ప్రతినిధులను కూడా విమర్శించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో రోజుకో కథనాన్ని రాస్తున్నారు. టీడీపీ కోపానికి ఓ కారణం ఉంది. టీవీ9లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది టీడీపీ భావన! అధికారపక్షానికి ఇచ్చే సమయంలో కనీసం సగం సమయమైనా తమకు ఇవ్వాలని టీడీపీ అనుకుంటోంది. కానీ టీవీ9లో మాత్రం ఎక్కువభాగం వార్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. మరోవైపు టీడీపీపై విమర్శనాత్మక కథనాలకే ప్రయారిటీ ఇస్తోంది.
టీవీ9 ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి , తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు(BRS) కొమ్ము కాస్తున్నదని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. అందుకే టీవీ9ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్‌పై విమర్శనాత్మక కథనాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంమీద తెలుగుదేశంపార్టీకి టీవీ9 సంస్థ కాదుకానీ, అందులోని ప్రముఖుడిపై పీకలదాకా కోపం పెట్టుకుంది. వర్తమాన పరిస్థితుల్లో మీడియా తటస్థంగా ఉంటే ఏ పార్టీకి నచ్చడం లేదు. ఏపీలో అయితే ఉంటే వైసీపీకి మద్దతుగానైనా ఉండాలి. లేకపోతే టీడీపీకి సపోర్ట్‌గా అయినా నిలబడాలి. అంతే తప్ప న్యూట్రల్‌గా వార్తలు రాస్తే పార్టీలకు నచ్చడం లేదు. రాజకీయ పార్టీలకు జర్నలిస్టులు లోకువయ్యారు.