బ్రిటీష్ పాలనను మించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రజలు, టీడీపీ(TDP) కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు, నిర్భంధాలు ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న నిరాహారదీక్ష(Hunger strike) లు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు.

బ్రిటీష్ పాలనను మించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రజలు, టీడీపీ(TDP) కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు, నిర్భంధాలు ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న నిరాహారదీక్ష(Hunger strike) లు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. టీడీపీ అధినేతకు సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదని అన్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తీరు చూస్తుంటే సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉంది. 30 పోలీస్ యాక్ట్ ఉంది అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

శాంతియుత నిరసనలూ జరగడానికి వీల్లేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి(DGP) అదేశాలు ఎందుకు ఇచ్చారు? అని ప్ర‌శ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడిది? అని నిల‌దీశారు. పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై(Rally) లేని నిషేధం ఏపీలోనే ఎందుకు? అని ప్ర‌శ్నించారు. పక్కన ఉన్న తెలంగాణలో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలో ఎందుకో.. సైకో సర్కార్ సమాధానం చెప్పగలదా? అని ప్ర‌శ్నించారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని.. ఈ ప్రభుత్వం తుప్పు పట్టిన అక్రమ కేసుల విధానంతో అడ్డుకోలేదని అన్నారు.

Updated On 23 Sep 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story