Nara Lokesh : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరగలేదు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ(Gudlavaleeru engieerin college) బాలికల వాష్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాల(Secrete Camera) వ్యవహారం పెను దుమారం రేపింది.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ(Gudlavaleeru engieerin college) బాలికల వాష్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాల(Secrete Camera) వ్యవహారం పెను దుమారం రేపింది. నిందితులను ప్రభుత్వం కాపాడుతున్నదనే ఆరోపణలు కూడా వచ్చాయి. నిన్నటికి నిన్న హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఇవాళేమో అసలు ఆ కాలేజీలో ఏమీ జరగలేదని తేల్చేశారు. విచారణకు ముందే లోకేశ్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. పనిలో పనిగా ఈ విషయాన్ని సెన్సేషన్ చేయవద్దని మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యంతో ప్రభుత్వం చేతులు కలిపిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోమంత్రి అనిత ఇప్పటి వరకు గుడ్లవల్లేరుకు ఎందుకు వెళ్లలేదో తెలియడం లేదు. ఈ వవ్యహారాన్ని మొదట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు నెట్టేయాలని చూసిన టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడెందుకు గమ్మున ఉంటోందన్నది కూడా అనుమానమే! మొత్తంగా గుడ్లల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.