Big Breaking : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A-14గా నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(amaravati inner ring road case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది.

Big Breaking
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(amaravati inner ring road case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే చంద్రబాబుతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయానికొస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అప్పటి సీఎం చంద్రబాబు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్పులు చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది.
