గన్నవరం(Gannavaram) ఇంఛార్జ్(Incharge) గా యార్లగడ్డ వెంకట్రావును(Yarlagadda Venkatarao) ప్రకటిస్తున్నా, పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని(Vamsi) ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్(Nara Lokesh) పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసిపినేతలు, వారి అనుచరులతో యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... టీడీపీ(TDP) కంచుకోట గన్నవరం. ఎందరో గొప్పవ్యక్తులు ఎమ్మెల్యేలుగా గన్నవరం నుండి ఎన్నికయ్యారు. గతంలో మేము చేసిన తప్పువల్లే గన్నవరం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.

గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావు!
అధికారికంగా ప్రకటించిన యువనేత లోకేష్
తల్లిలాంటి పార్టీకి వంశీ వెన్నుపోటు పొడిచారు
పిల్లసైకోని రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలి
కలసికట్టుగా గన్నవరంలో పసుపుజెండా ఎగురేయాలి
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి చేసే బాధ్యత నాది
లోకేష్ సమక్షంలో భారీగా టిడిపిలోకి చేరికలు

గన్నవరం(Gannavaram) ఇంఛార్జ్(Incharge) గా యార్లగడ్డ వెంకట్రావును(Yarlagadda Venkatarao) ప్రకటిస్తున్నా, పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని(Vamsi) ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్(Nara Lokesh) పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసిపినేతలు, వారి అనుచరులతో యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... టీడీపీ(TDP) కంచుకోట గన్నవరం. ఎందరో గొప్పవ్యక్తులు ఎమ్మెల్యేలుగా గన్నవరం నుండి ఎన్నికయ్యారు. గతంలో మేము చేసిన తప్పువల్లే గన్నవరం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. హేమాహేమీలను కాదని పేరు కూడా తెలియని వంశీని ఎమ్మెల్యేను చేశాం. 2019లోనూ భిన్నాభిప్రాయాలున్నా రెండోసారి వంశీని ఎమ్మెల్యేను చేశాం. ఇప్పుడు మాపై తప్పుడు ఆరోపణలు చేసే వంశీ ఆనాడు ఎందుకు బి.ఫామ్ తీసుకున్నాడు? రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. దేవుడు అన్నిరకాల పరీక్షలు పెడతారు, వాటిని తట్టుకున్నవారే నిలబడతారు. నాపైన, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు పెట్టింది. గన్నవరం టీడీపీ కార్యకర్తలపై దొంగ కేసుల పెట్టి, పార్టీ కార్యాలయంపైనా ఈ పిల్లసైకో దాడులు చేయించాడు. పిల్లసైకోను గెలిపించడానికి కృషి చేసిన టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధించారు, అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వంశీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయాలి, గన్నవరం గడ్డపై టిడిపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలి.

అర్జునుడు కుటుంబానికి అండగా ఉంటాం!

పిల్లసైకో వైసీపీలోకి వెళ్లిన తర్వాత ధైర్యంగా బచ్చుల అర్జునుడు ముందుకు వచ్చారు. అంచలంచెలుగా అర్చునుడు పార్టీలో ఎదిగారు. అమరావతి కోసం అసెంబ్లీలో పోరాడారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్సీలకు డబ్బులిచ్చి లాగాలని చూసినా నేను పుట్టింది టీడీపీలో, చనిపోయేది కూడా టీడీపీలోనే అని అర్జునుడు అన్నారు. కౌన్సిల్ లో నాపై దాడి చేసేందుకు ఒక మంత్రి ప్రయత్నిస్తే అర్జునుడు ముందుండి పోరాడారు. వైసీపీ వచ్చాక చాలా మంది ఇబ్బంది పడి జైలుకు వెళ్లారు. మీ అందర్నీ కాపాడుకునే బాద్యత నేను తీసుకుంటా. 2019 నుండి 2024 మధ్య ఎక్కువ ప్రజా సమస్యలపై పోరాడి ఎక్కువ కేసులున్నవారికి నామినేటెడ్ పోస్టుచ్చే బాధ్యత నేను తీసుకుంటా. బచ్చుల అర్జునుడు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.

పిల్లసైకోను శాశ్వతంగా సాగనంపండి!

పిల్ల సైకో వంశీని శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పించాలి. పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గానికి పెద్దమొత్తంలో నిధులు అందించాం. నేను క్షమాపణ చెప్పాలని అంటున్నారు...హెచ్సీఎల్, అపోలో టైర్స్ పరిశ్రమలు తెచ్చినందుకు, సీసీ రోడ్లు వేసినందుకు, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను అందించినందుకు క్షమాపణ చెప్పాలా? పట్టిసీమ కట్టిన దేవుడు చంద్రబాబు అని వంశీనే అన్నాడు, రెండు రోజుల తర్వాత పార్టీ మారాడు. ఒక్కరు పోతే వందలాది మంది నేతలను టీడీపీ తయారు చేస్తుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత మంగళగిరిలో టీడీపీ రెండు సార్లే గెలిచింది, కష్టమైన నియోజకవర్గాన్ని నేను ఎంచుకున్నా. కానీ భయపడి పారిపోలేదు. అధికారంలోకి వచ్చాక నిరంతరం నేను మీకు అందుబాటులో ఉంటా. వైసీపీ నుండి టీడీపీలో చేరేవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. వైసీపీ కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకోరు, కానీ టీడీపీ కార్యకర్తకు ఏదన్నా అయితే కంటికిరెప్పలా చూసుకుంటున్నాం. కార్యకర్తల సంక్షేమానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు పెట్టాం.

భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం: యార్లగడ్డ

కలసికట్టుగా పని చేసి గన్నవరంలో వంశీని ఓడిస్తాం. గన్నవరాన్ని భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం. నేను పెత్తనం చేయడానికి పార్టీలోకి రాలేదు, గన్నవరంలో టీడీపీ జెండా ఎగరేయడానికి వచ్చా. టీడీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని టిడిపి నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీలో నాతో పాటు పలువురు కార్యకర్తలకు తీరని అన్యాయం జరిగింది. నేను అధికారం కోసం టీడీపీలోకి రాలేదు, వంశీని ఓడించడమే మా లక్ష్యం. నేను నిజాయితీగానే పని చేస్తున్నా. వైసీపీ నుండి వచ్చే కార్యకర్తలు, నాయకులు ఏమీ ఆశించి రావడంలేదు. గన్నవరానికి మంచి భవిష్యత్ ఉండాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. నేను ఓడిన తర్వాత 4నెలలు ఇంచార్జ్ గా ఉన్నా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదు. దార్శనికుడు చంద్రబాబు విజన్ వల్లే ఐటీ రంగం అబివృద్ధి చెందింది. గత నాలుగేళ్లుగా గన్నవరంలో భూముల రేట్లు తగ్గిపోయాయి. గన్నవరానికి టీడీపీ ఏం చేసిందో నాకు అవగాహన ఉంది. నాతో పాటు వచ్చిన వైసీపీ నేతలతో టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేస్తారు, సమస్య ఉంటే కలసి కూర్చుని మాట్లాడుకుందాం. రాబోయే తరానికి లోకేష్ దిక్సూచిగా ఉంటారు. కుప్పంను ఎలా చూస్తున్నారో గన్నవరంను కూడా చంద్రబాబు, లోకేష్ అలాగే చూడాలని యార్లగడ్డ కోరారు.

టిడిపిలో చేరిన వైసిపి నాయకులు

యువనేత లోకేష్ సమక్షంలో వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరారు. పసుపుకండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గన్నవరం మాజీ ఎంపీపీ తుల్లిమిల్లి ఝాన్సీ, వైస్ ఎంపీపీ సుధీర్, గన్నవరం ఎంపీటీసీలు రంగారావు, మద్దినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీసీటీ కోటిరెడ్డి, కో-ఆపరేటివ్ అధ్యక్షుడు గొండిశివ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తగరం కిరణ్, ప్రసాదంపాడు అధ్యక్షులు గూడవల్లి శ్రీనివాస్, గన్నవరం నియోజకవర్గ ప్రచారకర్త విజయారావు, రామవరప్పాడు మాజీ ఉపాధ్యక్షులు కొల్లా ఆనంద్, గన్నవరం మహిళా అధ్యక్షురాలు బాడుగ ఘాన్సీ, నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పరసా కిరణ్ కుమార్, కాసరనేని రంగబాబు, కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పద్మప్రియ, రామవర్పాడు వార్డు మెంబర్లు, కొంగన రవి, బి.సురేష్, ఆజాద్ సహా 120 మంది క్రియాశీలక నేతలు, వారి అనుచరులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపిలు కొనకళ్ల నారాయణ, కంభంపాటి రామ్మోహన్, మాజీమంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్, కొల్లు రవీంద్ర, టిడిపి పొలిట్ బ్యూరోడ సభ్యుడు బోండా ఉమ, బచ్చుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated On 23 Aug 2023 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story