వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం వార్తల్లో చూస్తున్నాం. ఈ అరెస్టును అక్రమ అరెస్టు అని వైసీపీ అంటోంది.

వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం వార్తల్లో చూస్తున్నాం. ఈ అరెస్టును అక్రమ అరెస్టు అని వైసీపీ అంటోంది. అయితే వైసీపీ వాదనను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. గతంలో మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఇందులో రాజకీయపరమైన కక్షలు లేవు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని బలవంత పెట్టి ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారని టీడీపీ చెప్తోంది. 2023లో గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న వాహనాన్ని తగలబెట్టారు. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఓ రాజకీయాపార్టీ నేతలు మరొకర రాజకీయపార్టీ కార్యాలయంపై దాడిని ప్రజాస్వామ్యంలో ఎవరూ సమర్థించరు. ఈ సంఘటన సమంజసం కాదు, సమర్థించలేం కూడా. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో గన్నవరంలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌లో అన్నీ రాసుకుంటున్నామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి కార్యకర్తలు నారా లోకేష్‌ను రెడ్‌బుక్ గురించి ప్రశ్నించారు. అక్కడ నారా లోకేష్ రెడ్‌బుక్ గురించి ప్రస్తావిస్తూ రెడ్‌బుక్-3 త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదిలేది లేదని లోకేష్ అన్నారు. లోకేష్ చెప్పినట్లే ఈరోజు వల్లభనేని వంశీ అరెస్టుతో రెడ్‌బుక్ ఓపెన్ అయినట్లేనా.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..
