Nara Family To Visit Chandrababu : జైల్లో చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి చేరుకున్న కుటుంబ సభ్యులు
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Candrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాజమండ్రి(Rajahmundry) చేరుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్,
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Candrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాజమండ్రి(Rajahmundry) చేరుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, భర్త భరత్ ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును సెంట్రల్ జైలులో(Central) కలవనున్నారు.
ఇదిలావుంటే.. టీడీపీ శ్రేణులు, ఇతర నేతల రాకతో సెంట్రల్ జైలు వద్ద హడావుడి వాతావరణం నెలకొంది. దీంతో సెంట్రల్ జైలు ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జైలు ప్రధాన వీధిలో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతా సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఆయనకు జైలులో ప్రాణహాని ఉందని ఏసీబీ కోర్టులో వాదించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో కరుడు గట్టిన నేరస్తులు ఉన్నారని.. వారివల్ల చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని టీడీపీ శ్రేణులు సైతం ఆరోపిస్తూ ఉండడంతో భారీ ఆంక్షలు విధించారు.