టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స‌తీమ‌ణి భువనేశ్వరికి(Bhuvaneswari) తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. రేపల్లె, పర్చూరు, ఒంగోలు(Ongole) నియోజకవర్గాల్లో నిజం గెలవాలి(Nijam gelvali) కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి ఇండిగో(Indigo) విమానంలో గ‌న్న‌వ‌రం బ‌య‌లుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం గన్నవరంలో ల్యాండింగ్‌కు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స‌తీమ‌ణి భువనేశ్వరికి(Nara Bhuvaneswari) తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. రేపల్లె, పర్చూరు, ఒంగోలు(Ongole) నియోజకవర్గాల్లో నిజం గెలవాలి(Nijam gelvali) కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి ఇండిగో(Indigo) విమానంలో గ‌న్న‌వ‌రం బ‌య‌లుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం గన్నవరంలో ల్యాండింగ్‌కు ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరంలో విమానం ల్యాండింగ్ కు ప్రయత్నించగా.. వీల్ తెరుచుకోలేదు. దాంతో పైలెట్ విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాడు.

కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత ల్యాండింగ్ గేర్ తెరుచుకుని వీల్ బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దాంతో ప్ర‌యాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. నారా భువనేశ్వరికి గన్నవరం ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు స్వాగతం పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువ‌నేశ్వ‌రి.. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తలను కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

Updated On 30 Jan 2024 6:51 AM GMT
Ehatv

Ehatv

Next Story