చంద్ర‌బాబు(Chandrababu) స‌తీమ‌ణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) బుధవారం 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించారు. తొలుత నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి(NTR) నివాళులు అర్పించిన ఆమె.. ఆ త‌ర్వాత యాత్రను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..

చంద్ర‌బాబు(Chandrababu) స‌తీమ‌ణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) బుధవారం 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించారు. తొలుత నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి(Nara Bhuvaneswari) నివాళులు అర్పించిన ఆమె.. ఆ త‌ర్వాత యాత్రను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు జాతి అభ్యున్నతికి ఎన్టీఆర్ తన జీవితాన్నే అంకితం చేశారని అన్నారు. ఎల్లప్పుడూ సత్య మార్గంలోనే నడవాలని.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దారిమార్చుకోవద్దని చెప్పారని పేర్కొన్నారు.

చంద్రబాబు ఎన్టీఆర్ బాటలోనే నడుస్తూ తెలుగు జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టారని.. 47 రోజులుగా బంధించి ఉంచారని.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అండగా నిలిచిన వారిని, ఆయన జైలు పాలవడం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు యాత్ర మొదలు పెట్టానని తెలియ‌జేశారు. ఈ రోజు నుండి మా తెలుగుదేశ‌ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా చంద్రబాబు ప‌ట్ల‌ అంకితభావంతో ఉన్న మద్దతుదారులను కలవడానికి.. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను యాత్రను ప్రారంభిస్తున్నానని.. ప్రజలు ఆశీర్వదించాలని భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Updated On 25 Oct 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story