టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని..

టీడీపీ(TDP) అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు(TDP Workers) మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని.. చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest)పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలకు అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని.. అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు.

టీడీపీ జెండా రెపరెపలాడాలని వారు త‌మ‌ జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని.. వారు లేకుంటే పార్టీ లేదని పేర్కొన్నారు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని భువనేశ్వరి ఆరోపించారు. మాజీ సీఎం అయిన చంద్రబాబుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు.

Updated On 25 Sep 2023 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story