నాలుగు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష నేతగా అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మన భారత జాతి సంపదని టిడిపి నాయకురాలు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి(Nannapaneni Rajakumari) కొనియాడారు.

నాలుగు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష నేతగా అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మన భారత జాతి సంపదని టిడిపి నాయకురాలు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి(Nannapaneni Rajakumari) కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్(Tirupati Press Club) లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నాలుగు సంవత్సరాలుగా పాలన కొనసాగుతున్నప్పుడు చంద్రబాబు చేసిన అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

గత రెండు నెలల క్రితం యువగళం పాదయాత్రలో చంద్రబాబు వైసీపీ పాలనపై ప్రశ్నిస్తున్నప్పుడు.. యువ గళం ను ఫెయిల్యూర్ చేయాలని రాజకీయంగా టిడిపిని అంతం చేయాలనే కుట్రలో భాగమే.. మచ్చలేని చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. తెలుగు వారు వారి గళంను వినిపిస్తున్నారని తెలియజేశారు. తెలంగాణ నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం కోసం కట్టుబట్టలతో హైదరాబాదు వదిలి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేసుకుని, ప్రజా మన్ననలు పొందారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, నిర్మాణానికి కారకులైన చంద్రబాబు జైల్లో అనారోగ్య స్థితిలో, కంటి ఆపరేషన్ కు నోచు కోకుండా ఖైదీల మధ్య బాబు ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని.. అలాగే హౌస్ అరెస్టులు కూడా చేశారని తెలియజేశారు. ప్రజాధనంతో ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ పాలకులు వాడుకోకుండా కూల్చివేయడం పట్ల మండిపడ్డారు. గత 50 రోజులుగా చంద్రబాబుపై పెట్టిన కేసులలో ఆరోపణలే గాని నిజాలు లేవని స్పష్టమవుతుందని విమర్శించారు.

లేకుంటే ఎందుకు కేసును తేల్చడంలో ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసిపి పాలనలోకి వచ్చినప్పటినుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని.. జనం వైసీపీ దాడులకు భయపడి మౌనం వహిస్తున్నారన్నారు. నారా భువనేశ్వరి సభలకు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇది తన మనోభావానికి సంబంధించిన మాటలని ఆవేదనతో ప్రసంగిస్తున్నానన్నారు. కేంద్రం, మనరాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల కుట్ర రాజకీయాలపై తాను ప్రసంగించనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ , జనసేనల కలయికతో ముందుకు నడుస్తున్నామని ఇరు పార్టీల అధిష్టాన నిర్ణయాలను తాము పాటించి అవి నెరవేర్చే దిశగా తాము ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు.

Updated On 27 Oct 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story