Baireddy Rajasekhar Reddy : బైరెడ్డి..ఇక సైకిల్ సవారీ !
రాయలసీమ(Rayalaseema) వెనుకబాటుతనపై గళమెత్తి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Baireddy Rajasekhar Reddy)..తిరిగి టీడీపీలో(TDP) చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కూతురు శబరితోపాటు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఈ నెలాఖరులోగా టీడీపీ కండువా కపుకోనున్నారని సమాచారం.

ఉమ్మడి కర్నూలుజిల్లాలో(Kurnool) రాజకీయాలను శాసించే కుటుంబాల్లో బైరెడ్డి కుటుంబం ఒకటి. రాయలసీమలో బైరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. రాయలసీమ వెనుకబాటుతనంపై గళమెత్తి రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బైరెడ్డి రాజశేఖ రెడ్డి. నందికొట్కూరు సెగ్మెంట్లో 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ప్రత్యర్థి గౌరు చరితారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో బైరెడ్డి పాణ్యంలో పోటీ చేయాల్సి వచ్చింది. 2012లో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ గళం అందుకున్నారు. ఆ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా మారడంతో.. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరారు. అనంతరం కూతురు శబరితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ..తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బైరెడ్డికి నంద్యాల ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలను తమకే ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పాణ్యం నుంచి కూతురు శరిని పోటీ చేయించే యోచనలో ఉన్నారట. బైరెడ్డి చేరికను నియోజకవర్గ నేతలు కూడా స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ నేలాఖరులోగా కూతురు శబరితోపాటు టీడీపీలో చేరుతారని సమాచారం.