మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాల(Nandhyala) పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత ఆమెను నంద్యాలకు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై(Subba Reddy) దాడి ఘటనలో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాల(Nandhyala) పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత ఆమెను నంద్యాలకు తరలించారు. ఏవీ సుబ్బారెడ్డిపై(Subba Reddy) దాడి ఘటనలో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. . భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. నంద్యాల నియోజకవర్గంలో భూమ అఖిలప్రియ అనుచరులు అదే పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. కిందపడిన ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న అఖిలప్రియ, ఇతర నాయకులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. మంగళవారం టీడీపీ నాయకుడు లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలోనే అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated On 16 May 2023 11:50 PM GMT
Ehatv

Ehatv

Next Story