Sri Bharath : విశాఖ నార్త్ సీటుపై కర్చీఫ్ వేసిన శ్రీభరత్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విపక్ష పార్టీలలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. టీడీపీ(TDP), జనసేనలు(Janasena) ఎప్పట్నుంచో పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు తెలియాల్సిందల్లా ఆ కూటమిలో బీజేపీ(BJP) చేరుతుందా లేదా అని! మరోవైపు జనసేన తమతోనే ఉందని బీజేపీ అంటోంది. పొత్తు ఎప్పుడు పొడిచేనూ? ఎప్పుటు సీట్ల సర్దుబాటు జరిగేనూ అని టీడీపీ క్యాడర్ అనుకుంటోంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో తెలియక అల్లాడిపోతున్నారు ఆశావహులు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విపక్ష పార్టీలలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. టీడీపీ(TDP), జనసేనలు(Janasena) ఎప్పట్నుంచో పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు తెలియాల్సిందల్లా ఆ కూటమిలో బీజేపీ(BJP) చేరుతుందా లేదా అని! మరోవైపు జనసేన తమతోనే ఉందని బీజేపీ అంటోంది. పొత్తు ఎప్పుడు పొడిచేనూ? ఎప్పుటు సీట్ల సర్దుబాటు జరిగేనూ అని టీడీపీ క్యాడర్ అనుకుంటోంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో తెలియక అల్లాడిపోతున్నారు ఆశావహులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(General elections) విశాఖ(Vishaka) లోక్‌సభ నుంచి పోటీ చేయాలని నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna) అల్లుడు శ్రీభరత్(Sri Bharath) అనుకుంటున్నారు. ఒకవేళ బీజేపీతో(BJP) టీడీపీ పొత్తుపెట్టుకుంటే మాత్రం విశాఖ లోక్‌సభ సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అనుకూలమైనవాటిని వెతుక్కుంటున్నారు శ్రీభరత్. భీమిలి తెలుగుదేశంపార్టీకి కాసింత అనుకూలమే! కాకపోతే పొత్తులో భాగంగా అది జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. విశాఖ సౌత్అనుకుంటే అక్కడ ఆల్‌రెడీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ(Gandi babji) ఉన్నారు. ఇక మిగిలింది విశాఖ నార్త్ ఒక్కటే! అక్కడ్నుంచే శ్రీభరత్ పోటీ చేస్తారని అంటున్నారు. చూస్తే ఆయన నార్త్ నుంచి పోటీ చేస్తారా అన్నది తమ్ముళ్లకు డౌట్ కలుగుతోంది. లోకేశ్ శంఖారావం సభలో శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన అక్కడ్నుంచి పోటీకి సిద్ధమవుతున్నారని అనిపిస్తోంది. విశాఖ నార్త్ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టేజ్ మీద ఉన్నా శ్రీభరత్ ఏ మాత్రం మొహమాటపడకుండా మాట్లాడేశారు. గంటా అందుబాటులో లేకపోయినా తాను విశాఖ నార్త్ నియోజకవర్గం ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు అండగా ఉంటానని శ్రీభరత్ అన్నారు. గంటాపై టీడీపీ అధినాయకత్వానికి సదుద్దేశమేమీ లేదు. ఇంతకాలం టీడీపీని పట్టించుకోలేదనే భావన ఉంది. ప్రస్తుతానికి గంటా భీమిలీ మీద దృష్టిపెట్టారు. అది కాకుంటే చోడవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు కానీ, విశాఖ నార్త్ నుంచి శ్రీభరత్ పోటీ చేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి.