Balayya Vs Jr.NTR : బాలయ్య వర్సెస్ జూ.ఎన్టీఆర్.. తారస్థాయికి విభేదాలు!
తెలుగు ముద్దుబిడ్డ, మహానటుడు నందమూరి తారక రామారావు(Sr NTR) వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ఘాట్‌లో(NTR ghat) పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. జూ.ఎన్టీఆర్(Jr.NTR) వస్తున్నారని ఆయన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రాం(Kalyan Ram) ఆయనకు నివాళులు అర్పించారు.
తెలుగు ముద్దుబిడ్డ, మహానటుడు నందమూరి తారక రామారావు(Sr NTR) వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ఘాట్‌లో(NTR ghat) పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. జూ.ఎన్టీఆర్(Jr.NTR) వస్తున్నారని ఆయన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రాం(Kalyan Ram) ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత కొద్ది సేపు ఘాట్ దగ్గరే కూర్చొని వెళ్లిపోయారు. జూ.ఎన్టీఆర్ వెళ్లిపోయిన కాసేపటికే బాలకృష్ణ(Balakrishna) అక్కడికి వచ్చారు. తండ్రికి బాలకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆ తర్వాత ఘాట్ నిర్వాహకులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తీసేశారని చెప్తున్నారు.
గత కొంత కాలంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా(Social media) వేదికగా జూనియర్ ఎన్టీయార్ అభిమానులకీ, బాలకృష్ణ అభిమానులకీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) సందర్భంగా కూడా జూ.ఎన్టీఆర్ మౌనం వహించడంతో ఆయనపై బాలకృష్ణ, లోకేష్(Lokesh) అభిమానులు విరుచుకుపడ్డారు. తాజాగా ఓ టీడీపీ(TDP) కార్యక్రమంలో జూనియర్ అభిమానులు, లోకేష్ ఫ్యాన్స్ కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. కొంతకాలంగా జూ.ఎన్టీఆర్ కూడా దూరంగా ఉంటున్నారు. గతంలో రీసెంట్ ఫంక్షన్‌లో తారక్, కల్యాణ్‌రాం ఇద్దర్నీ బాలయ్య పలకరించని వీడియో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నటసార్వభౌముని పేరు మీద కాయిన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నందమూరి ఫ్యామిలీ(Nandhamuri Family) సందడి చేసింది. కానీ ఆ ఫంక్షన్‌కు ఎన్టీఆర్ రాలేదు.
మరోవైపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారు. కొడాలి నాని కూడా భారీ కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం గుడివాడలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు నిన్నటి నుంచే హడావిడి చేస్తున్నారు. పొటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.
చంద్రబాబు కార్యక్రమం, కొడాలి నాని కార్యక్రమం సందర్భంగా ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. దీంతో గుడివాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.