సీట్ల సర్దుబాట్లు టీడీపీకి(TDP) తలపోట్లు తెస్తోంది. చాలా నియోజకర్గాలలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అనపర్తిలోనూ అంతే! అక్కడి తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జ్‌ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) తల్లి, భార్య, పిల్లలతో కలిసి రోడ్డెక్కారు. న్యాయంకోసం అనే నినాదాన్ని ఎత్తుకుని అనపర్తి నియోజకవర్గం(Anaparthi Constituency) అంతా తిరుగుతున్నారు. రామకృష్ణారెడ్డికి టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి, తర్వాత ఆ సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబునాయుడు.

సీట్ల సర్దుబాట్లు టీడీపీకి(TDP) తలపోట్లు తెస్తోంది. చాలా నియోజకర్గాలలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. అనపర్తిలోనూ అంతే! అక్కడి తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జ్‌ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) తల్లి, భార్య, పిల్లలతో కలిసి రోడ్డెక్కారు. న్యాయంకోసం అనే నినాదాన్ని ఎత్తుకుని అనపర్తి నియోజకవర్గం(Anaparthi Constituency) అంతా తిరుగుతున్నారు. రామకృష్ణారెడ్డికి టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి, తర్వాత ఆ సీటును బీజేపీకి కేటాయించారు చంద్రబాబునాయుడు. అనపర్తి నుంచి బీజేపీ తరఫున ఎం.శివకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. దీంతో నల్లమిల్లి హతాశులయ్యారు. ఇంత దారుణమా అని మథనపడుతున్నారు. అసలు రామకృష్ణారెడ్డిని పట్టించుకున్నవారే లేరు. ఓదార్పు పేరుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరితో(Gorantla bucchaiah choudhary) పాటు ఒకరిద్దరు నాయకులు ఆయన దగ్గరకు వెళ్లారంతే! కాకపోతే వారిని టీడీపీ క్యాడర్‌ అడ్డుకుంది. ఒకవేళ అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే నల్లమిల్లిని పిలిపించుకుని ఆ విషయాన్ని చంద్రబాబు చెప్పవచ్చు. కానీ అదేమీ చేయలేదు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. 1985లో మళ్లీ అనపర్తి నుంచే విజయం సాధించారు. ఆ త‌ర్వాత 1994, 1999లో కూడా మూలారెడ్డి తెలుగుదేశంపార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నిసార్లు ఓడిపోయారు కూడా! మూలారెడ్డి వార‌సుడిగా రామ‌కృష్ణారెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఈయన 2014లో టీడీపీ త‌రపున విజ‌యం సాధించారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నిక‌ల్లో విజయం పక్కా అని భావిస్తూ వచ్చిన రామకృష్ణారెడ్డి అయిదేళ్లుగా గ్రౌండ్‌ను ప్రిపేర్‌ చేసుకుంటూ వచ్చారు. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి బీజేపీకి కేటాయించ‌డంపై న‌ల్ల‌మిల్లి జీర్ణించుకోలేక‌పోతున్నారు. కృష్ణా జిల్లా పెన‌మలూరు తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జ్ బోడె ప్ర‌సాద్‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని మొద‌ట చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ప‌లువురి పేర్ల‌తో ఐవీఆర్ఎస్ స‌ర్వే కూడా నిర్వ‌హించారు. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని భార్యా, పిల్ల‌ల‌తో బోడె ప్ర‌సాద్ రోడ్డెక్కారు. అలాగే ప‌లు చాన‌ళ్ల ఇంట‌ర్వ్యూల్లో త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. దీంతో చంద్ర‌బాబునాయుడు త‌లొగ్గారు. అన‌ప‌ర్తి విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు లెక్కచేయడం లేదు. నల్లమిల్లి తన సామాజికవర్గం కాకపోవడం వల్లే చంద్రబాబు ఇలా చేస్తున్నారని నల్లమిల్లి అభిమానులు అంటున్నారు.

Updated On 30 March 2024 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story