Nakka Anandababu : ఓట్లు తొలగించాలని మంత్రి నాగార్జున చెప్పడమేంటి?
రాష్ట్రంలో వైసీపీ నేతల(YCP Leader) కారణంగా ఓటర్లు తమ ఓటు ఉందో లేదోనని ప్రతిరోజూ తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు(Nakka Anandababu) అన్నారు. వేమూరునియోజకవర్గంలో(Vemuru Constituency) ఓటర్ల జాబితా అవకతవకలపై ఆయన గుంటూరు(Gunturu) జిల్లా పరిషత్ సీఈవోను కలిసి మాట్లాడారు.

Nakka Anandababu
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు
రాష్ట్రంలో వైసీపీ నేతల(YCP Leader) కారణంగా ఓటర్లు తమ ఓటు ఉందో లేదోనని ప్రతిరోజూ తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు(Nakka Anandababu) అన్నారు. వేమూరునియోజకవర్గంలో(Vemuru Constituency) ఓటర్ల జాబితా అవకతవకలపై ఆయన గుంటూరు(Gunturu) జిల్లా పరిషత్ సీఈవోను కలిసి మాట్లాడారు. తెదేపా సానుభూతిపరుల ఓట్లు తొలగించాలన్న మంత్రి నాగార్జున(Minister Nagarjuna) వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఓట్లు తొలగించాలని మంత్రి చెప్పడమేంటని ప్రశ్నించారు. ‘‘ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియలో అధికార పార్టీ జోక్యం పెరిగింది. ఇతర పార్టీల వారి ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతి మండలంలో నాలుగైదు వేల ఓట్లు తొలగించాలని మంత్రి నాగార్జున చెప్పారు. ప్రభుత్వ కార్యాలయంలో సమావేశం పెట్టినందున చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోను కోరినట్లు నక్కా ఆనంద్బాబు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ ఘటనపై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవటంపై స్పందిస్తూ దొంగే దొంగ అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
