నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌(Nagarjunasagar Reservoir) దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)-తెలంగాణ(Telangana) రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కారణంగా మరోసారి నాగార్జునసాగర్‌ డ్యామ్‌ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌పి(NSP) ఉద్యోగులు, ఇంజనీర్లను సీఆర్‌పీఎఫ్‌ బలగాలు(CRPF) అడ్డుకుంటున్నాయి.

నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌(Nagarjunasagar Reservoir) దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)-తెలంగాణ(Telangana) రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కారణంగా మరోసారి నాగార్జునసాగర్‌ డ్యామ్‌ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌పి(NSP) ఉద్యోగులు, ఇంజనీర్లను సీఆర్‌పీఎఫ్‌ బలగాలు(CRPF) అడ్డుకుంటున్నాయి. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Election) ముందు నాగార్జునసాగర్‌ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తెరమీదకు వచ్చింది. లాస్టియర్‌ నవంబర్‌ 29వ తేదీ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, ఆ రాష్ట్రానికి చెందిన నీటి పారుదలశాఖ అధికారులు ప్రధాన డ్యామ్‌పైకి వచ్చి 13వ నంబర్‌ గేటు వరకు ఏపీ పరిధిలోకి వస్తుందని చెబుతూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేశారు.కేంద్ర జలశక్తి శాఖ జోక్యంతో డిసెంబర్‌ 3వ తేదీన ప్రధాన డ్యామ్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు రెండు వైపులా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.

ఫలితంగా సాగర్‌ డ్యాంను సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుండి వారి కంట్రోల్‌లోనే ఉంటూ వచ్చింది. జనవరి 17వ తేదీ వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యామ్‌కు కుడివైపున 13వ నంబర్‌ గేటు అవతలికి వెళ్లేందుకు అనుమతి అయితే ఇచ్చారు కానీ విధులు నిర్వహించేందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్న కంట్రోల్‌ గది దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలకు పరిష్కారం కనుక్కోవడానికి కేంద్ర జలశక్తి శాఖ సమావేశంమయ్యింది. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను(Srisailam Project) కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. సీఆర్‌పీఎఫ్‌ అధికారులు మాత్రం ఎన్‌ఎస్‌పి సిబ్బంది, అధికానులను ఏపీవైపు వెళ్లకుండా 13వ నంబర్‌ గేటు దగ్గరే నిలిపివేస్తున్నారు

13వ నంబరు గేటు దాటి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లు చెబుతున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య జలవివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే దానిపై సందిగ్దత నెలకొంది. ఫలితంగా పనులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధాన డ్యామ్‌పై కుడికాల్వ గేట్లపైన, సూట్‌ గేట్లు, క్రస్ట్‌ గేట్లకు గ్రీసింగ్‌, రబ్బరు సీళ్ల మరమ్మతులు, రూఫ్‌లకు సర్వీసింగ్‌ చేయడంవంటి పనులు చేయాల్సి ఉంది. నీటి సంవత్సరం ప్రారంభం కావడానికి మరో అయిదు నెలల సమయమే ఉండటంతో అధికారులలో టెన్షన్ పెరుగుతోంది. నిజానికి డిసెంబర్‌ నుంచే ఈ పనులు మొదలు కావాలి. వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రాజెక్టును సిద్ధం చేసుకోవాలి. అయితే తెలంగాణ ఇంజనీర్లను 13వ నంబరు గేటును దాటనివ్వడం లేదు. పనులు కూడా చేయనివ్వడం లేదు. డ్యామ్‌ మొత్తం తమకు అప్పగిస్తే తప్ప పనులు పూర్తి కావని తెలంగాణ అధికారులు అంటున్నారు.

Updated On 22 Jan 2024 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story