Nagababu : చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారు
చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని జనసేన నేత నాగబాబు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందని అన్నారు.

Nagababu Reacts on Chandrababu Arrest
చంద్రబాబు(Chandrababu)ను అన్యాయంగా అరెస్టు చేశారని జనసేన నేత నాగబాబు(Nagababu) అన్నారు. తిరుపతి(Tirupaathi)లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారని వెల్లడించారు. టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తును జన సైనికులు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. పవన్(Pawan) ను ప్యాకేజీ స్టార్(Package Star) అంటే చెప్పుతో కొడతాం అని హెచ్చరించారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందని తెలిపారు. రూ. కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదని అన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేన తరపున సీట్లు ఇవ్వమని.. ప్రజా సేవకులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని తెలిపారు.
