గత ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో నారా లోకేష్ ఓటమి కాగా.. ఈసారి వైసీపీ ఓ మహిళను దించబోతోంది.

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే లోక్ సభ, శాసన సభ ఎన్నికలకు సంబంధించి విడతల వారీగా వైసీపీ అభ్యర్థుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎనిమిది జాబితాలు బయటకు రాగా.. తాజాగా తొమ్మిదో జాబితా కూడా వెలువడింది. ఈ జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పేరు కూడా వచ్చింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ మంగళగిరి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎన్నో కార్యక్రమాలు స్థానికంగా చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో నారా లోకేష్ ఓటమి కాగా.. ఈసారి వైసీపీ ఓ మహిళను దించబోతోంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను వైసీపీ నియమించింది.

వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక లోక్‌సభ స్థానానికి, రెండు శాసనసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది తొమ్మిదో జాబితా. వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వేణుంబాక విజయసాయిరెడ్డిని నియమించడం ఆసక్తికర పరిణామం. ఇక కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎ.ఎండీ ఇంతియాజ్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌) ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.మురుగుడు లావణ్యలను మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated On 1 March 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story