Mudragada Padmanabham : పవన్‌కు ముద్రగడ ఘాటు లేఖ
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌కు(Pawan kalyan) హరిరామజోగయ్య(Harirama Jogaiah) లేఖలు రాసి రాసి అలసిపోయారు. చివరికి ఇక మీ ఖర్మ అంటూ గాఢ నిట్టూర్పును విడిచారు. ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కూడా పవన్‌కు ఓ ఘాటైన లేఖ రాశారు. పవన్ కల్యాణ్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు.

Mudragada Padmanabham
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌కు(Pawan kalyan) హరిరామజోగయ్య(Harirama Jogaiah) లేఖలు రాసి రాసి అలసిపోయారు. చివరికి ఇక మీ ఖర్మ అంటూ గాఢ నిట్టూర్పును విడిచారు. ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కూడా పవన్‌కు ఓ ఘాటైన లేఖ రాశారు. పవన్ కల్యాణ్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. లేఖలోని సారాంశమేమిటంటే 'రెండు సార్లు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు. రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి’ అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర విమర్శలు చేశారు.
