Mudragada Padmanabham : ద్వారంపూడిని ఓడించి సత్తా చాటండి.. పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ సవాల్
జనసేన(janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) మాజీంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఫైర్ అయ్యారు. పవన్ కాకినాడ(Kakinada) వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓ ఘాటు లేఖ రాశారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి మీరేందుకు యువతకు రిజర్వేషన్ ఫలాలు అందించలేదని ప్రశ్నించారు.
జనసేన(janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) మాజీంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఫైర్ అయ్యారు. పవన్ కాకినాడ(Kakinada) వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓ ఘాటు లేఖ రాశారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి మీరేందుకు యువతకు రిజర్వేషన్ ఫలాలు అందించలేదని ప్రశ్నించారు. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంత వరకు న్యాయమన్న ముద్రగడ.. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని హితువు పలికారు. పదే పదే తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అని అంటున్నారరు.. ఇప్పటి వరకు ఎంత మందిని అలా చేశారో చెప్పాలని అడిగారు.
ద్వారంపూడి(dewarampudi) కుటుంబం తప్పుడు మార్గంలో సంపాదిస్తుందని అనడం కరెక్ట్ కాదని.. కాపు ఉద్యమానికి సహకరించిన వారిని విమర్శించడం తగదని అన్నారు. ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్‌ను ప్రశ్నించారు ముద్రగడ. ద్వారంపూడిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి.. సత్తా చూపించడానికి ముందుకురండని ముద్రగడ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో పోటీచేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండని అడగాలి తప్ప.. కలిసి పోటీ చేసినప్పుడు అడగటం హస్యాస్పదంగా ఉందని అన్నారు.