Mudragada: నమస్కారములండి అంటూ ముద్రగడ లేఖ.. ఏముందంటే?
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మార్చి 14వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మార్చి 14వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా వేసుకోనున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరబోతుండడంపై తన అభిమానులకు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానని ముద్రగడ తెలిపారు. మరలా ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానని తెలిపారు. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు.. చేయను కూడా అని ముద్రగడ లేఖలో తెలిపారు.
ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నానని.. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకొని తాడేపల్లికి రావాలని కోరుతూ లేఖలో రూట్ మ్యాప్ గురించి తెలియజేశారు ముద్రగడ.