Mudragada Padmanabha Reddy : చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(CM chandrababu) ముద్రగడ పద్మనాభరెడ్డి(Mudhragada Padmanabha reddy) ఓ ఘాటు లేఖ(Letter) రాశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(CM chandrababu) ముద్రగడ పద్మనాభరెడ్డి(Mudhragada Padmanabha reddy) ఓ ఘాటు లేఖ(Letter) రాశారు. లేఖలో పలు విమర్శలు చేశారు. నిలదీశారు. అధికారదాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్(Super six) హామీల తుఫాన్ సృష్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేయడం మీవంటి సీనియర్లకు తగునా అంటూ ప్రశ్నించారు ముద్రగడ. సూపర్‌సిక్స్ హామీలను నెరవేర్చాలంటూ కోట్లాది రూపాయలు అవసరమవుతాయన్న విషయం ఎన్నికలకు ముందు తెలియదా ? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదోవ పట్టించడానికి తిరుపతి లడ్డూ(Tirumala laddu) వివాదం సృష్టించారని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్(Redbook), తప్పుడు పోస్టింగ్‌లు, అరాచకాలు అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చారని చెబుతూ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా చంద్రబాబు అని గట్టిగా నిలదీశారు. పీపీపీ పద్దతిలో పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకుని, వాహనదారులు రోడ్లమీద తిరగడానికి లక్షలాది రూపాయలు ఏం వి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు... మళ్లీ టోల్ టాక్స్ వసూలు చేయడం న్యాయమంటారా? అని లేఖలో కడిగేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేయడం అడ్డుకోకపోవడం చాలా అన్యాయమన్నారు. నిరుద్యోగుల కోసం ప్రత్యేక హోదా కోసం, ప్రయత్నం చేయకపోవడం కూడా చాలా అన్యాయమని చెప్పారు.
సూపర్ సిక్స్ హామీలు, నిరుద్యోగుల ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ కాపాడడం, ప్రత్యేక హోదా కోసం కృషి చేయండి కానీ అమాయకులను అన్యాయంగా జైలులో పెట్టి కొట్టించడం మంచిది కాదని చంద్రబాబుకు సలహా ఇచ్చారు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి!