MP Sanjeev Kumar : వైసీపీ నుంచి మరో ఎంపీ ఔట్..!
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(Sanjeev Kumar) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంజీవ్ కుమార్.
ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్(Parliament) సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. కర్నూలు(Kurnool) పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అన్నారు.
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(Sanjeev Kumar) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంజీవ్ కుమార్.
ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్(Parliament) సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. కర్నూలు(Kurnool) పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అన్నారు. నాలుగు ఇళ్లలో రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని(CM Jagan Moha Reddy) కలిసే అవకాశం వచ్చింది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేలు చూసుకుంటారని ఆయన చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా నా పరిధిలో నేను చేయగలిగిన కార్యక్రమాలు చేశానని సంజీవ్ కుమార్ అన్నారు. కానీ అనుకున్నన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.
ఈసారి పార్లమెంట్ టికెట్ మరొకరికి ఇస్తారని తెలిసింది. సహచరులు, సన్నిహితులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నేను వృత్తిరీత్యా డాక్టర్‌నని.. 25 వేల ఆపరేషన్లు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని సంజీవ్‌కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్‌గా ఉండాలా లేదా ప్రజాప్రతినిధిగా ఉండాలన్నది నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే నేను నడుచుకుంటానని చెప్పారు.