MP Margani Bharat : స్కామ్ లలో చంద్రబాబు ఎక్స్‌ఫర్ట్
నలభై సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ అని చెప్పుకునే చంద్రబాబు స్కామ్ లలో ఎక్స్‌ఫర్ట్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు విషయమై ఎంపీ భరత్ మాట్లాడుతూ..

MP Margani Bharat Comments on Chandrababu Arrest
నలభై సంవత్సరాల పొలిటికల్ హిస్టరీ(Political History) అని చెప్పుకునే చంద్రబాబు(Chandrababu) స్కామ్(Scam) లలో ఎక్స్‌ఫర్ట్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్(MP Margani Bharat) ఆరోపించారు. చంద్రబాబు రిమాండ్(Chandrababu Remand( పొడిగింపు విషయమై ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఖర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో 23 మంది ఉసురు తీసుకున్న చంద్రబాబు.. అదే రాజమండ్రి సెంట్రల్ జైలు(Central Jail)లో శిక్ష అనుభవించడం అంటే.. ఎక్కడ పాపం చేస్తే అక్కడే శిక్ష అనుభవించాలన్న 'ఖర్మ సిద్ధాంతం' బాబు అనుభవపూర్వకంగా గ్రహించి ఉంటారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(Skill Development Scam))లో సీమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ(Siemens International Company)తో ఒప్పందం కుదుర్చుకున్నాక.. ఆ కంపెనీ పెడుతుందన్న రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటాగా రాష్ట్ర ఖజానా నుంచి ప్రజా ధనం రూ.370 కోట్లు హవాలా పద్ధతిలో సూట్ కేసులతో తిరిగి చంద్రబాబు ఇంటికి వెళ్ళాయని.. ఇది మాత్రం సుస్పష్టమన్నారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనేది సీఐడీ(CID) రూడీ చేసుకుంది కాబట్టే అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపర్చారని.. ఇంకా 'నేనేమి తప్పుచేయలేదు.. సత్య హరిశ్చంద్రుడు తమ్ముడిని' అంటే చట్టం ఒప్పుకోదన్నారు.
చంద్రబాబు, రామోజీరావు(Ramoji Rao) మనుషులకు అతీతులుగా.. దైవాంశ సంభూతులుగా భావించుకుంటుంటారని.. ఎవ్వరైనా చట్టం ముందు ఒకటేనని, ఎవరూ అతీతులు కారనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదన్నారు. దొంగ జీవోలు, దొంగ ఎంఓయూలతో రాష్ట్ర ఖజానాను భారీగా కొల్లగొట్టారని.. ఒకటొకటిగా అవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ పైబర్ నెట్(AP Fibernet), ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner Ring Road).. ఇలా తవ్వేకొద్దీ తండ్రీ కొడుకుల భారీ స్కాంలు అనేకం బయటకు వస్తున్నాయని చెప్పారు.
చంద్రబాబు బయటకు రావాలంటే సీఐడీ అడిగిన ప్రశ్నలను దాటవేయకుండా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు అరెస్టు అయితే ఏ ఒక్కరూ 'పాపం చంద్రబాబు' అని సానుభూతిగా అనడం లేదని, జిత్తులమారి నక్కలానే ప్రజలు భావిస్తున్నారన్నారు. స్కిల్ స్కాంలో డిజైన్ టెక్ కంపెనీ సీఈఓ, ఎండీ.. దేశం విడిచి వెళ్ళిపోయాడని, అలాగే చంద్రబాబు పీఎస్, లోకేష్(Lokesh) సన్నిహితుడు.. వీళ్ళంతా ఎక్కడికి పారిపోయినా కలుగులో దాంకున్న ఎలుకను లాగినట్టు సీఐడీ లాగుతుందని.. ఎవ్వర్నీ వదలదనే విషయం చంద్రబాబు అండ్ కో గ్రహిస్తే మంచిదని ఎంపీ భరత్ హితవు పలికారు.
