MP Kesineni Nani : రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి, నా స్థాయి ఒకటే
విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని(MP Kesineni nani) వైసీపీలో(YCP) చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన మీద విమర్శలు చేసిన వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విమర్శలపై ఘాటుగా బదులిచ్చారు.
విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని నాని(MP Kesineni nani) వైసీపీలో(YCP) చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన మీద విమర్శలు చేసిన వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విమర్శలపై ఘాటుగా బదులిచ్చారు. కాల్‌మనీ గాళ్ల మాటలకు సమాధానం చెప్పనని.. ఎన్నికల(Election) అనంతరం ఈవీఎంలు(EVM) ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవద్దని కేశినేని చిన్నికి ఎంపీ నాని సూచించారు.
తాను టీడీపీకి (TDP)రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలో చేరానని ఆయన తెలిపారు. ఏపీ సీఎం జగన్(CM Jagan) పిలుపు మేరకే వైసీపీలో చేరానని వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని కేశినేని నాని అన్నారు. అవసరమైతే 100 శాతం కూడా ఖాళీ చేయిస్తానని సవాలు విసిరారు. రాజకీయాల్లో చంద్రబాబు(Chandrababu) స్థాయి, తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేశ్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని చెప్పారు. ప్రజలంతా జగన్ వెనుక ఉన్నారని.. వైసీపీలో నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ ఉంటుందని అన్నారు.