MP Ayodhya Rami Reddy : వైసీపీలో జగన్కు ఎంత హక్కు ఉందో సుచరితకి అంతే ఉంది
వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియరఖ నాయకురాలు మేకతోటి సుచరిత పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..

MP Ayodhya Rami Reddy About Mekathoti Sucharitha
వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి(Ayodhya Rami Reddy) మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు మేకతోటి సుచరిత(Mekathoti Sucharitha) పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు(Prathipadu)లో సుచరిత పోటీచేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్తిపాడులో వైసీపీ ని నిర్వీర్యం చేసే విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ(YSRCP) పార్టీలో సీఎం జగన్(CM Jagan)కు ఎంత హక్కు ఉందో సుచరితకి అంతే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ నిర్మాణంలో సుచరిత పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్తిపాడులో పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంతో మంది ఏవేవో చేస్తుంటారు.. పట్టించుకోవద్దని శ్రేణులకు సూచించారు. సుచరిత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రత్తిపాడుకి రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధులు విషయంలో హెవీ కాంపిటీషన్(Heavy Compitition) ఉందని తెలిపారు.
