MP Avinash Reddy : సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Kadapa MP Avinash Reddy).. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sood) కు లేఖ రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రాంసింగ్(Ramsingh)పై లేఖ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రాంసింగ్ దర్యాప్తు చేశారని లేఖలో ఆరోపించారు. రాంసింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ల ఆధారంగా అవినాష్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
వివేకా రెండో వివాహం(Viveka Second Marriage), బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్(Banglore Land Settlement) అంశాలు లేఖలో ప్రస్తావించారు. దస్తగిరి(Dastagiri) నిలకడలేని సమాధానాల ఆధారంగా రాంసింగ్ విచారణ జరిపారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని అవినాష్ లేఖలో పేర్కొన్నారు. మున్నా(Munna) లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని అవినాష్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. విచారణలో రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలని అవినాష్ రెడ్డి లేఖలో కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని అవినాష్ సీబీఐ డైరెక్టర్ ను కోరారు.