YS Avinash Reddy : ఆ ఫోన్ రావడం ఒక్క 15 నిమిషాలు ఆలస్యం అయివుంటే.. ఈ రోజు నామీద నిందలు ఉండేవి కావు
వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు సుదీర్ఘంగా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడాని చాలా కష్టపడాల్సి వస్తోంది.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

MP Avinash Reddy Says Political Conspiracy Behind CBI Investigation
వివేకా హత్యకేసు(YS Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు సుదీర్ఘంగా పులివెందుల(Pulivendula) క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తికే నిజాయితీ నిరూపించుకోవడాని చాలా కష్టపడాల్సి వస్తోంది.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. సునీతమ్మ(YS Sunitha) స్టేట్మెంట్ లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మొదట సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ లో మా ప్రస్తావనే లేదు. మొదట లెటర్ దాచిన విషయంలో కూడా మా కుటుంబానికి సంబంధం లేదు అన్నారు. అయితే ఇప్పుడు సునీతక్క పూర్తిగా మాట మార్చిందని అన్నారు.
సునీతక్క భర్త రాజశేఖరరెడ్డి(Rajashekar Reddy) ఫోన్ చేస్తేనే నేను అక్కడికి వెళ్ళానని తెలిపారు. ఫోన్ రావడం ఒక 15 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే.. ఈ రోజు నామీద నిందలు ఉండేవి కావని అన్నారు. నన్ను కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. నాకు నాన్నకు(YS Bhaskar Reddy), శంకర్ రెడ్డి(Shankar Reddy) అన్నకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివేకా సార్(YS Vivekananda Reddy) ను హత్య చేయబోమే ముందు దస్తగిరి(Dasthagiri) వాల్లు రాయించిన లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆనాడే వాల్లు చంపి డ్రైవర్ ప్రసాద్(Prasd) ను ఇరికించాలని చూశారు. ఈ రోజు అటువంటి కుట్రే నా మీద జరుగుతుందని వివరించారు. నేను ఏ పాపం చేయలేదు కాబట్టి గత మూడు సంవత్సరాలుగా సీబీఐ విచారణ గురించి పట్టించుకోలేదని వెల్లడించారు.
మీడియా ఈ కేసులోని వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రేపు, ఎల్లుండి కూడా పులివెందులలో ఉంటానని తెలిపారు. సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేస్తుందా అని మీడియా ప్రశ్నించగా.. అంతా దైవాదీనం అని సమాధానం ఇచ్చారు. ధర్మో రక్షతి రక్షితః అన్న దాన్ని నేను నమ్ముతా.. ధర్మమే కాపాడుతుందని చెప్పారు. నేను ఎంత మంచివాడినో జిల్లా ప్రజలకు తెలుసన్నారు.
