Motkupalli Narasimhulu Hunger Strike : చంద్రబాబు కోసం నిరాహార దీక్ష చేయనున్న బీఆర్ఎస్ నేత
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబును(Chandrababu) అక్రమంగా అరెస్టు(Arrest) చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా కేసీఆర్ చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించాలని అన్నారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా చేశారని..

Motkupalli Narasimhulu Hunger Strike
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబును(Chandrababu) అక్రమంగా అరెస్టు(Arrest) చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా కేసీఆర్ చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించాలని అన్నారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా చేశారని.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్(KCR) అరెస్ట్ పై స్పందించాలన్నారు. రెండు, మూడు రోజులలో రాజమండ్రికి వెళ్లి నారా భువనేశ్వరిని పరామర్శిస్తానని తెలిపారు. ములాఖత్ అవకాశం వస్తే జైల్లో చంద్రబాబును కలుస్తానని చెప్పారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తాను రేపు ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నానని మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పి.. తప్పును సరిచేసుకోవాలని ఏపీ సీఎం జగన్ కు సూచించారు. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే సీఎం జగన్ బాధ్యుడని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఏపీ ప్రజలు జగన్‌కు కచ్చితంగా గుణపాఠం చెపుతారని జోష్యం చెప్పారు.
