ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలల రూపు రేఖలను మార్చేశారు. నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. బడి పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. విద్యాబోధన తీరు తెన్నులను అమాంతం మార్చేశారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలల రూపు రేఖలను మార్చేశారు. నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. బడి పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. విద్యాబోధన తీరు తెన్నులను అమాంతం మార్చేశారు. పేదల ఇళ్లల్లో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. ఆధునీకరణ సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టారు. ఇంత మంచిని కూడా విపక్షాలు దుర్బుద్ధితో విమర్శించాయి. మాతృభాష తెలుగు పట్ల జగన్‌ నిరాదరణ కనబరుస్తున్నారని ఆరోపించాయి. అక్కడికేదో తమ పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నట్టు గాయ్‌ గత్తర చేశాయి. అయినా జగన్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీలో పిల్లలు చక్కటి ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. వారికి టోఫెల్‌(TOFEL) శిక్షణను కూడా అందిస్తున్నారు. పేద పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు జగన్‌. అంతర్జాతీయ వేదికలతోబాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షలమంది పిల్లలు హాజరై తమ ప్రతిభను కనబరిచారు. దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5907 స్కూళ్ళకు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది.

Updated On 11 April 2024 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story