వైసీపీకి మోపిదేవి గుడ్‌బై?

వైసీపీకి(YCP) ఆ పార్టీ సీనియర్‌ నేత, జగన్‌కు(YS Jagan) అత్యంత సన్నిహితుడు మోపిదేవి వెంకటరమణ(Mopidevi venkataramana) పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇదే విషయంపై తన అనుచరులతో మోపిదేవి మంతనాలు చేస్తున్నారు. రేపు పార్టీకి రాజీనామా చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి గట్టి ఆఫరే రావడంతో వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోపిదేవి తొలి నుంచి వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ కేబినెట్‌లో పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్‌ మరణం తరువాత జగన్‌పై నమోదైన సీబీఐ కేసుల్లో మోపిదేవి నిందితుడుగా ఉన్నారు. కొంత కాలం జైలు శిక్ష అనుభవించారు. జగన్ పార్టీలో చేరిన తరువాత కీలక బాధ్యతల్లో పని చేశారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కానీ మోపిదేవి ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు పంపిచారు. ఎంపీలుగా ఎన్నికైన తరువాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మోపిదేవికి మరోసారి రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, కొంత కాలంగా మోపిదేవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో మోపిదేవిని పార్టీ మారాలంటూ అనుచరవర్గం నుంచి ఒత్తిడి మొదలైంది. కార్యకర్తల సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story