Monsoon : కదలని రుతుపవనాలు, మరో పది రోజుల పాటు తీవ్రమైన ఎండలు
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని సంబరపడ్డాం. కానీ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన రుతుపవనాలు అక్కడ్నుంచి కదలమని మారం చేస్తున్నాయ. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయాయి. ఈపాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. రుతుపవనాలు కదలకపోవడంతో తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయ.

Summer continue 10 more days
నైరుతి రుతుపవనాలు (south west monsoon) వచ్చేస్తున్నాయని సంబరపడ్డాం. కానీ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన రుతుపవనాలు అక్కడ్నుంచి కదలమని మారం చేస్తున్నాయ. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయాయి. ఈపాటికి దేశంలోని సగానికి పైగా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది. రుతుపవనాలు కదలకపోవడంతో తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయ. మరో పది రోజుల పాటు ఎండలు ఉంటాయని వాతావరణశాఖ అంటోంది. వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాన్ ప్రభావంతో తేమ మొత్తం అటువైపుకు వెళ్లడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. ఫలితంగా ఉష్ణోత్రతలు పెరిగాయి. రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వర్షాకాలం వచ్చినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలో ఈ నెల 20 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదిన కేరళను రుతుపవనాలు తాకుతాయ. జూన్ 10వ తేదీన తెలంగాణకు రుతు పవనాలు వస్తాయి. కానీ ఈసారి రుతుపవనాలు కేరళను 8వ తేదీన తాకాయి. అందుకే తెలంగాణలో ఈ నెల 18వ తేదీన రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.
