ఓటమి భయంతోనే చంద్రబాబు(Chandrababu) దొంగ ఓట్ల(fake votes) డ్రామా ఆడుతున్నాడ‌ని ఎమ్మెల్సీ రుహుల్లా(MLC Ruhullah) మండిప‌డ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్ళింది ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం(NTR 100rs Coin) ప్రారంభోత్సవానికి కాదు..

ఓటమి భయంతోనే చంద్రబాబు(Chandrababu) దొంగ ఓట్ల(fake votes) డ్రామా ఆడుతున్నాడ‌ని ఎమ్మెల్సీ రుహుల్లా(MLC Ruhullah) మండిప‌డ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్ళింది ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం(NTR 100rs Coin) ప్రారంభోత్సవానికి కాదు.. టీడీపీని(TDP) బీజేపీలో(BJP) విలీనం చేసేందుకే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే 60 లక్షల దొంగ ఓట్లు సృష్టించారని ఫైర్ అయ్యారు. దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబు నాయుడు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఎగిరేది వైసీపీ జెండానే అని ఘంటాప‌ధంగా చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని అన్నారు.

ఏపీలో(AP) దొంగ ఓట్లు విష‌యమై టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవ‌ల‌ భారత ఎన్నికల ప్రధాన కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు గల్లంతు అవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విష‌య‌మై వైసీపీ శ్రేణులు టీడీపీ అధినేత‌పై మండిప‌డుతున్నాయి. గతంలో టీడీపీ చేర్చిన దొంగ ఓట్లు పోతుంటే చంద్రబాబు వణుకుతున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు. 2015 నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. స్థిరనివాసం లేనివాళ్లకు ఓట్లు ఇచ్చారన్నారని.. సేవామిత్ర, మై టీడీపీ యాప్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డార‌ని వైసీపీ ఎంపీలు సైతం ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

Updated On 30 Aug 2023 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story