Nagababu Vs SVSN : పిఠాపురం పీఠమెక్కిన నాగబాబు.. మరి వర్మ పరిస్థితి..!
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు(MLC Naga Babu) శుక్రవారం పర్యటించారు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు(MLC Naga Babu) శుక్రవారం పర్యటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గొల్లప్రోలులోని మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం పలువురికి మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, నాగబాబు పర్యటనలో టీడీపీ(TDP), జనసేన (Jsp)కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు ‘జై వర్మ’ అని నినదించారు. తాము ఏం తక్కువ కాదన్నట్లు జనసేన కార్యకర్తలు ‘జై జనసేన, జై పవన్‌కల్యాణ్’ నినాదాలు చేశారు. 150 మందికిపైగా పోలీసులతో అధికారులు భద్రత కల్పించారు. అయితే నాగబాబు పర్యటనలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ వర్మ() అటువైపునకు కూడా చూడలేదు. కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామ్య పక్షం. అయినప్పటికీ పిఠాపురం(Pitapuram)లో మాత్రం ఉప్పు, నిప్పులా టీడీపీ, జనసేన నేతలు కలహించుకుంటున్నారు
