కడప కార్పొరేషన్ సమావేశంలో రసాభాసగా మారింది. M.L.A. కు మేయర్ కు మధ్య వివాదం చోటు చేసుకుంది.

కడప కార్పొరేషన్ సమావేశంలో రసాభాసగా మారింది. M.L.A. కు మేయర్ కు మధ్య వివాదం చోటు చేసుకుంది.

మేయర్ అధ్యక్షతన జరుగుతున్న సర్వ సభ్య సమావేశంలో వై.సి.పి., టి. డి.పి. నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. M.L.A. మాధవి రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆమెకు వేదిక పై కూర్చోవడానికి కుర్చీ వేయకపోవడంతో M.L.A. నిరసనను తెలిపింది.

గతంలో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. కడప మేయర్ సురేష్ బాబు వై.సి. పి. కి చెందిన నాయకుడు అవడంతో ఈ గొడవ మొదలవుతుంది. కావాలనే మాధవి రెడ్డిని అవమానిస్తున్నారు అని టీ.డి.పి. వర్గాలు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫిషియో మెంబర్ గా M.L.A. సమావేశానికి హాజరు అయినప్పటికీ ఆమెకు తగిన మర్యాద దక్కడం లేదని M.L.A. సీరియస్ అవుతున్నారు.

ఇంతకుముందు సమావేశంలో జరిగిన గొడవ కూడా ఇరు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కార్పొరేషన్ లో ఎక్కువగా వై.సి. పి. సభ్యులు ఉండడంతోనే ఈ పరిస్థితి వస్తుంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఏమైనా కార్పొరేషన్ సమస్యలు చర్చించి, వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నించకుండా.. ఇలా ఆధిపత్య పోరుకు దిగడం అనేది ప్రజా ధనాన్ని వృధా చేస్తూ.. వారి పట్ల నిర్లక్ష్యం వహించడమే అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ehatv

ehatv

Next Story