MLA Vasantha Krishna Prasad : 'పుష్ప కాదు.. మైలవరం ఫ్లవర్ దేవినేని ఉమా'
మైలవరం నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు వచ్చినా ఫ్లవర్ కారణంగానే వస్తున్నాయని, ఆయన పుష్ప కాదని ఫ్లవర్ అని, అందరి చెవుల్లో ఫ్లవర్ పెట్టడమే అఆయన పని అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైలవరం(Mylavaram) నియోజకవర్గంలో ఏ ఇబ్బందులు వచ్చినా ఫ్లవర్ కారణంగానే వస్తున్నాయని, ఆయన పుష్ప(Pushpa) కాదని ఫ్లవర్ అని, అందరి చెవుల్లో ఫ్లవర్(Flower) పెట్టడమే అఆయన పని అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheshwarrao)పై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్( Vasantha Venkata Krishna Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైలవరంలో ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital) ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను ఫ్లవర్ కాదు ఫైర్' అని ఆయనకి ఆయన ఊహించుకుంటూ ఉంటాడన్నారు. వాస్తవానికి ఆయన ఫైర్ ఎందులో చూపించాలంటే.. అధికారంలో వున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధిపై చూపించాలన్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఈ ప్రభుత్వ ఆసుపత్రి కనిపించలేదా? అంటూ మాజీమంత్రి దేవినేని ఉమాను విమర్శించారు.
మైలవరంలో ప్రభుత్వ భూమి పూరగుట్ట ఉంటే ఈయన ఏదో అమెరికాను కొలంబస్ కనిపెట్టినట్లు పూరగుట్టను తనే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పూరగుట్టను దాచిపెట్టింది ఎవరు? వెలికి తీసింది ఎవరు అని ప్రశ్నించారు. రెండు నెలల్లో అధికారం పోయేనాటికి జవాబు పత్రాల పేరుతో పూరగుట్టకు పనికిరాని కాగితాలు అంటగట్టి పేదల చెవుల్లో ఫ్లవర్ లు పెట్టినది నిజం కాదా? అని దేవినేని ఉమాను ప్రశ్నించారు. సీఎం జగనన్న నాయకత్వంలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన మాట మేరకు మైలవరం నియోజకవర్గంలో 20 వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు.
మైలవరంలో రూ.75 లక్షల నిధులు మురిగిపోయే పరిస్థితులలో ఎస్సీ ఏరియాలో ఆ ప్రాంత ప్రజల బహిరంగ ప్రజాప్రయోజనాల కోసం కమ్యూనిటీ హాల్ కట్టడం కోసం నలుగురు ఇళ్ళను ఖాళీ చేయించినట్లు స్పష్టం చేశారు. తమకు ఎవరికి ఏ అన్యాయం ఉద్దేశం లేదన్నారు. వాళ్లకు ఇళ్లస్థలాలు ఇస్తామని ముందే చెప్పినప్పటికీ, మైలవరం ఫ్లవర్ దేవినేని ఉమా కారణంగా ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు.
మాజీమంత్రి దేవినేని కడుపు మంటతో, కుళ్ళుమోతు బుద్ధితో ఈ విషయం అడ్డం పెట్టుకొని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ తన ఉనుకుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఇళ్ళు కోల్పోయిన వారిపై తమకు ఎటువంటి కోపం, కక్ష్య, ద్వేషం లేదన్నారు. వెంటనే వారికి ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు.