Balakrishna : ఎన్టీఆర్‌తో రామోజీ అనుబంధం ప్రత్యేకం
రామోజీరావు(Ramoji Rao) మరణం అత్యంత బాధాకరమని సినీ నటడు, ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) అన్నారు. రామోజీరావు తీవ్ర తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారని, తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించారని బాలకృష్ణ అన్నారు.
రామోజీరావు(Ramoji Rao) మరణం అత్యంత బాధాకరమని సినీ నటడు, ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) అన్నారు. రామోజీరావు తీవ్ర తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారని, తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించారని బాలకృష్ణ అన్నారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారని, తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని చెప్పారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దిన రామోజీరావు సినిమా రంగంలోనూ రాణించారని గుర్తు చేశారు. చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారని బాలకృష్ణ చెప్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోందని బాలయ్య అన్నారు. మా తండ్రి ఎన్టీఆర్‌తో(NTR) ఆయన అనుబంధం ప్రత్యేకమైనదని చెప్పారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాలకృష్ణ.