పాఠశాలల విలీనం, ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి జగన్(Jagan) ఉపాధ్యాయులకూ సవాలక్ష పనులు అప్పగించి వేధిస్తున్నాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(MLA Angani Sathyaprasad) మండిప‌డ్డారు. విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పోటీ పడి మరీ ఉపాధ్యాయులకు అవసరం లేని పనులు అప్పగించి అదనపు పనిభారం మోపడం వారి పైశాచికత్వానికి నిదర్శనం అన్నారు.

పాఠశాలల విలీనం, ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి జగన్(Jagan) ఉపాధ్యాయులకూ సవాలక్ష పనులు అప్పగించి వేధిస్తున్నాడని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(MLA Angani Sathyaprasad) మండిప‌డ్డారు. విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పోటీ పడి మరీ ఉపాధ్యాయులకు అవసరం లేని పనులు అప్పగించి అదనపు పనిభారం మోపడం వారి పైశాచికత్వానికి నిదర్శనం అన్నారు. విద్యార్థుల ఇళ్లకెళ్లి వారు హోంవర్క్ చేశారో లేదో చూడమంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి వింత విధానం? అని ప్ర‌శ్నించారు. పిల్లల ఇళ్లకు టీచర్లు తర్వాత వెళతారు కానీ ముందు మంత్రి బొత్స వైసీపీ మేనిఫెస్టో చూసుకోవాలని హితువు ప‌లికారు. ఉద్యోగులకు మీరిస్తామన్న పీఆర్సీ ఏమైంది? వారికి మీరిస్తామన్న ఇళ్ల స్థలాలు ఎంతవరకూ వచ్చాయి? అని ప్ర‌శ్నించారు.

మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఒక రోజు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల్లా పనిచేస్తే వారి కష్టాలు తెలుస్తాయన్నారు. అస్తమానం యాప్ లు అప్ లోడ్ పేరుతో పిల్లలకు పాఠాలు చెప్పనివ్వకుండా టీచర్ల సమయమంతా వృథా చేస్తే వాళ్లు పాఠాలు ఎప్పుడు చెప్పాలి? అని ప్ర‌శ్నించారు. బయోమెట్రిక్‌ హాజరు, నాడు-నేడు ప్రోగ్రస్‌, మధ్నాహ్న భోజన పథకం, పారిశుధ్యం నిర్వహణ సహా పలు కార్యక్రయాల అమలుపై ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశించడం అనాలోచిత నిర్ణయం కాదా? అని మండిప‌డ్డారు.

ఉన్నతాధికారులు పాఠశాలల తనిఖీలకు వెళ్లినప్పుడు విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఆరా తీయకుండా.. యాప్ లు డౌన్ లోడ్ చేశారా.. అని టీచర్లను ప్రశ్నించడం సిగ్గుచేటు కాక మరేమిటి? పిల్లల చదువుల కంటే మీకు యాప్ లే ఎక్కువయ్యాయా? నాలుగేళ్ల మీ పాలనా నిర్వాకానికి ఎన్నో సమస్యలు ఉంటే వాటిని వదిలేసి ఈ యాప్ ల గోలేంటి? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఉన్న సమయమంతా యాప్‌లతో కుస్తీ పడటానికే సరిపోవడంతో పిల్లల చదువులు అటకెక్కుతున్నాయని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేక మరోవైపు పనిభారంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగా ఉండకపోవడంతో టీచర్లు పడే వేదనకు జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని ప్ర‌శ్నించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. బోధనేతర పనులను వారికి అప్పగించకూడదనే కనీస అవగాహన మీకు లేదా? విద్యాబోధన అంతా నిర్వీర్యం చేస్తున్న యాప్‌లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Updated On 6 Aug 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story