Vidadala Rajini Strong Warning to Chintamaneni : చింతమనేని నీ నోరు అదుపులో పెట్టుకో..
రాజకీయ నాయకుల నోళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎప్పుడేం మాట్లాడాలో సోయి లేకుండా పోతోంది. ఇలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనీసం ఓ మహిళా మంత్రి గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి చింతమనేని అంటూ రజనీ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. చింతమనేనికి సంస్కారం లేదని, మహిళల పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తారో వనజాక్షి ఘటనతోనే నిరూపణ అయిందని రజనీ వివరించారు.

అసలేం జరిగిందంటే.. ఏలూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై దాడి జరిగింది. ఆమె ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థిని పరామర్శించడానికి వెళ్లిన చింతమనేనికి ఆసుపత్రి బర్నింగ్ వార్డ్‌లో సౌకర్యాలు సరిగ్గా లేవని అనిపించింది. వెంటనే సూపరింటెండెంట్ విజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 'మీ వైద్యశాఖ మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతున్నారా? ' అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పర్యటనకు వెళ్లిన రజనీని మీడియా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించాలని అడిగింది. సభ్యత, సంస్కారం లేని నాయకుడి మాటలపై మాట్లాడాల్సిన అవసరం లేదని జవాబిచ్చారు రజనీ. గతంలో ఎమ్మార్వో వనజాక్షి విషయంలో చింతమనేని ప్రవర్తించిన తీరు అందరికీ తెలుసన్నారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వైద్య రంగానికి ఏమీ చేయలేదని విమర్శించారు రజనీ. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రజనీ అన్నారు.